విద్యార్థినుల‌కు అశ్లీల మెసేజీలు..వాట్స‌పుల్లో ఎక్స్‌రేటెడె క్లిప్పింగులు: ప్రొఫెస‌ర్‌ను ర‌ఫ్పాడించారు!

చండీగ‌ఢ్‌: విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు ఓ ప్రొఫెస‌ర్. సెల్‌ఫోన్ ద్వారా వారికి అశ్లీల మెసేజీలు, వాట్స‌పుల్లో అర్ధ‌న‌గ్న ఫొటోలను పంపించసాగాడు. మొద‌ట్లో దీన్ని విద్యార్థినులు లైట్‌గా తీసుకున్నారు. దీనితో అత‌ను మ‌రింత రెచ్చిపోయాడు. ఏకంగా ఎక్స్ రేటెడ్ వీడియో క్లిప్పింగుల‌ను పంపించ‌డం మొద‌లు పెట్టాడు.

దీనితో విద్యార్థినుల ఆగ్ర‌హం న‌షాళానికి అంటింది. క్యాంప‌స్‌లోనే ఆ ప్రొఫెస‌ర్‌ను ప‌ట్టుకుని ఉతికి ఆరేశారు. పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని పాటియాలా ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల‌లో చోటు చేసుకుంది. ఆ ప్రొఫెస‌ర్ పేరు అతుల్ జోహ్రీ. త‌మ‌కు పంపించిన అశ్లీల సందేశాలు, ఇత‌ర క్లిప్పింగుల‌ను వారు సాక్ష్యంగా చూపారు. ప్రొఫెస‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

గ‌తంలో జెఎన్‌యూలో ప‌ని చేసిన స‌మ‌యంలోనూ అత‌ను ఇలాగే ప్ర‌వ‌ర్తించేవాడ‌ట‌. దీనితో అత‌ణ్ని పాటియాలా కాలేజీకి బ‌దిలీ చేశారు. అయిన‌ప్ప‌టికీ.. అత‌ని బుద్ధి మార‌లేదు. త‌న కంటికి న‌చ్చిన కొంద‌రు విద్యార్థినుల మొబైల్ నంబ‌ర్ల‌ను తీసుకుని.. త‌ర‌చూ అశ్లీల మెసేజీల‌ను పంపించేవాడు. అత‌ని వేధింపుల‌ను భ‌రించ‌లేక‌.. విద్యార్థినులు క్యాంప‌స్‌లోనే అత‌నికి బుద్ధి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here