రెండురోజులుగా విధుల‌కు వెళ్ల‌లేదు..మూడోరోజు!

బెంగ‌ళూరు: అనుమానాస్ప‌ద స్థితిలో ఓ యువ‌తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న బెంగ‌ళూరు శివార్ల‌లోని నెల‌మంగ‌ల‌లో చోటు చేసుకుంది. మృతురాలి పేరు భీమ‌వ్వ‌. 18 సంవ‌త్స‌రాలు. క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బుర‌గి జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన భీమ‌వ్వ ఉపాధి కోసం మూడేళ్ల కింద‌ట‌ నెల‌మంగ‌ల స‌మీపంలోని అరిశెన‌కుంటెలో ఉన్న బంధువుల ఇంటికి వ‌చ్చింది.

బంధువుల ఇంట్లో ఉంటూ బెంగ‌ళూరులో ఓ ప్రైవేటు సంస్థ‌లో ప‌నిచేస్తోంది. రెండురోజులుగా ఆమె విధుల‌కు వెళ్ల‌లేదు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమె మ‌ర‌ణంపై ప‌లు అనుమానాలు వెల్లువెత్త‌డంతో పోలీసులు అనుమానాస్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై నెల‌మంగ‌ల పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here