పాపం ప‌సివాడు..రేటు రూ.2 ల‌క్ష‌లే

ప‌నాజి: అర్జంట్‌గా డ‌బ్బులు అవ‌స‌రం వ‌చ్చినవారు ఏం చేస్తారు? తెలిసిన వాళ్ల వ‌ద్ద అప్పు తీసుకుంటారు. అప్పు దొర‌క్క‌పోతే.. ఇంట్లో ఉండే ఏవైనా విలువైన వ‌స్తువుల‌ను తాక‌ట్టు పెడ‌తారు. మ‌రి ఈ మ‌హిళ ఏం చేసిందో తెలుసా? ఏకంగా త‌న 11 నెల‌ల మ‌గ‌బిడ్డ‌కు అమ్మ‌కానికి పెట్టింది. 2 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చి, బాబును తీసుకెళ్లి పోవచ్చంటూ రేటు క‌ట్టింది.

పెళ్లై చాలా రోజులైనా పిల్ల‌లు లేని ఓ వ్య‌క్తికి త‌న చిన్నారిని అమ్మేసింది. దీనిపై ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆమెను అరెస్టు చేశారు. గోవా రాజ‌ధాని ప‌నాజిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిందితురాలి పేరు శైలా పాటిల్‌.

ప‌నాజికి చెందిన శైలాపాటిల్‌కు భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం ఆమెది. డ‌బ్బులు అవ‌స‌రం కావ‌డంతో త‌న 11 నెల‌ల బాబును అమ‌ర్ మోర్జే అనే వ్య‌క్తికి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు అమ్మేసింది.

దీనిపై ప‌క్కా స‌మాచారం అంద‌డంతో ప‌నాజీలోని పొండా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా వారిని ప‌ట్టుకున్నారు. శైలా పాటిల్, అమ‌ర్ మోర్జే, వారికి స‌హ‌క‌రించిన యోగేష్ గోస్వామి, అనంత్ దామ్జీల‌ను అరెస్టు చేసిన‌ట్టు పొండా పోలీస్‌స్టేష‌న్ ఇన్స్‌పెక్ట‌ర్ హ‌రీష్ మ‌ద్‌కైక‌ర్ తెలిపారు. పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా కింద కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here