ఆశారాం బాపు దోషి.. అతడు అత్యాచారం చేశాడు..!

ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే ఆశారాం బాపును కోర్టు దోషిగా తేల్చింది. ఆశారాం బాపు అత్యాచారం చేశాడని సాక్ష్యాధారాలతో నిర్ధారణ అయిందని జోద్ పూర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అన్నారు. దాదాపు అయిదేళ్ళ తర్వాత ఆశారాం ను దోషిగా తెలుస్తూ జోద్ పూర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్ కోర్టు తీర్పును ఇచ్చింది. జోద్ పూర్ సెంట్రల్ జైలుకు వెళ్ళిన తర్వాత ఆశారాం బాపుకు విధించబోయే శిక్షను తెలియజేయనున్నారు.

ఆశారాం ఓ బాలికను రేప్ చేశాడన్న ఆరోపణలతో 2013లో అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, ఆయన్ను జైలుకు తరలించగా, అప్పటి నుంచి ఆశారాం జైల్లోనే ఉన్నాడన్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. అన్ని సాక్ష్యాలు ఆశారాంకు వ్యతిరేకంగా ఉండడంతో దోషిగా తేల్చింది కోర్టు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని ఆశారాం కల్పించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చెప్పి, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి, తనను దేవుడిగా నమ్మి వచ్చిన అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడని అన్నారు. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న మిగతా ఐదుగురు కూడా దోషులేనని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here