పాపం.. ఈ కారు ఓనర్ ఎవరో కానీ..!

ఈ కారు ఫోటోను చూసిన ప్రతి ఒక్కరి నోటి నుండి బయటకు వచ్చే మొదటి పదం.. పాపం ఈ కారు ఓనర్ ఎవరో అని.. ఎందుకంటే ఆ కారు పరిస్థితి అలాగ ఉందన్న మాట..! లండన్ లోని టవర్ హామ్లెట్స్ వద్ద ఈ కారు ఇలా పూర్తిగా గడ్డకట్టుకుపోయింది.

గత కొద్ది రోజులుగా లండన్ లో విపరీతమైన మంచు కురుస్తోంది. చాలా మంది తమ తమ కార్లను బేస్ మెంట్లలో పార్క్ చేసుకున్నారు. పార్కింగ్ ప్రదేశం లేని వాళ్ళు ఇలా బయటవదిలిపెట్టేశారు. ఈ కారు కూడా అదే బాపతుకు చెందినదే..! బయట పార్క్ చేయగా విపరీతమైన మంచుకు ఇలా గడ్డ కట్టుకుపోయింది. ఆ కారు ఓనర్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా కుదిరేలా కనిపించడం లేదు. ఐరోపా లోని చాలా దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ‘బీస్ట్ ఫ్రమ్ ది ఈస్ట్’ సైక్లోన్ దెబ్బకు ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి.

సైబీరియా నుంచి తరుముకొచ్చే అతిశీతల పవనాలు ఐరోపా దేశాలను వణికిస్తున్నాయి. ఈ శీతల గాలులను బ్రిటన్‌ లో ‘బీస్ట్‌ ఫ్రమ్‌ ద ఈస్ట్‌’ అని నెదర్లాండ్స్‌ లో ‘సైబీరియన్‌ బియర్‌’ అని, స్వీడన్‌ లో ‘స్నో కేనన్‌’ అని పిలుస్తారు. స్కాట్ లాండ్ లోని గ్లాస్గో విమానాశ్రయం మూతపడింది. లండన్ కు రావాల్సిన చాలా విమానాలు క్యాన్సిల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here