మినిమమ్ బ్యాలెన్స్ కూడా పెట్టుకోలేని పేదవాళ్ళారా.. మీకొక శుభవార్త..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా పెట్టుకోలేని వారికి ఇప్పటికే చాలా డబ్బులు లాగేసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో బండ బూతులు తిట్టడమే కాకుండా పేదవాళ్ళే కదా మినిమమ్ బ్యాలెన్స్ కూడా పెట్టుకోలేని వారు.. వాళ్ళ నుండి కూడా డబ్బులు నొక్కేయాలా అని అంటూ ఉన్నారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని వందల కోట్లను మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోలేని ఖాతాదారుల నుండి లాగేసుకుందని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో వారికో శుభవార్త తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..!

మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే విధించే చార్జీలను బ్యాంకు 75 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ చార్జీలు రూ.50గా ఉండగా, ఇకపై రూ.15గా అమలవుతుంది. దీనికి జీఎస్టీ అదనం. కనీస నీల్వలో 75 శాతానికి పైగా లేకపోతేనే ఈ చార్జీ వర్తిస్తుంది. ఒకవేళ 50 శాతానికి కంటే తక్కువగా ఉంటే అప్పుడు చార్జీ రూ.10 మాత్రమే. సెబీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో గరిష్టంగా (75 శాతానికి పైగా బ్యాలన్స్ లేని సందర్భంలో) ఉన్న రూ.40 చార్జీ రూ.12, రూ.10కి తగ్గించడం జరిగింది. ఈ చార్జీలకు జీఎస్టీ అదనం. సవరించిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here