భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ ఫోన్ ధర.. 76వేల రూపాయల ఫోన్.. 39వేల రూపాయలకే..!

గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ ఎక్స్ఎల్ ఫోన్ 128జీబీ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ ధర ఏకంగా 47శాతం తగ్గింది. అమెజాన్ వెబ్ సైట్ లో 39వేల రూపాయలుగా ఈ ఫోన్ ధరను నిర్ణయించారు. ఈ ఫోన్ అసలు ధర గతంలో 76వేల రూపాయలు ఉండేది.

అక్టోబర్ 2016లో గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ ఫోన్ ను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 5.50ఇంచెస్ డిస్ప్లే, 1440 x 2560 పిక్సెల్ రెజల్యూషన్.. 534 పిక్సెల్స్ పర్ ఇంచ్ ఉంది. ఆ మొబైల్ లో 1.6GHz క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్ తో పాటుగా 4GB ర్యామ్ కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 32GB/64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ లలో లభిస్తుంది.

గూగుల్ తాజాగా ప్రవేశపెట్టిన పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ఫోన్ 49,999 రూపాయలకు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తోంది. గతంలో ఈ వేరియంట్ 64జీబీ ధర 73వేల రూపాయలు, 128 జీబీ ధర 82వేల రూపాయలు ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here