గోపీ చంద్ పంతం టీజర్.. హిట్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి..!

గోపీచంద్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న పంతం సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపీచంద్ గత చిత్రాలు చాలా వరకూ నిరాశ పరిచినప్పటికీ.. ఈ చిత్రంలో మాత్రం అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. గోపీ చంద్ ను ఎలాగైతే తెలుగు ప్రేక్షకులు చూడాలని అనుకున్నారో.. అచ్చం అలాగే ఉన్నాడు ఇందులో..! ”లోపలున్నది బయటకు తీస్తాం.. బయటున్నది లోపలేస్తాం” అంటూ కామెడీ టైమింగ్ తో మొదలుపెట్టినా.. చివర్లో పవర్ ఫుల్ డైలాగ్ తో దుమ్మురేపాడు గోపీ చంద్..!

బలుపు, పవర్‌, జై లవకుశ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ మూవీ జులై 5వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here