భారీగా న‌ష్టాలొస్తున్నాయ‌ని..అంద‌మైన అమ్మాయిని సేల్స్‌గ‌ర్ల్‌గా పెట్టుకున్నాడు: ఆ దెబ్బ‌తో!

తైపే: కొద్దిరోజులుగా భారీగా న‌ష్టాల‌ను చ‌విచూస్తూ వ‌స్తున్నాడో మాంసం వ్యాపారి. ఏరోజుకారోజు న‌ష్టాలే త‌ప్ప‌..లాభాల‌ను ఆర్జించే ప్ర‌స‌క్తే లేకుండా పోయింది.

చివ‌రికి- ఇంట్లో విలువైన వ‌స్తువుల‌ను కూడా తాక‌ట్టు పెట్టుకోవాల్సి వ‌చ్చింది. మార్కెట్లో కంటే త‌క్కువ రేటుకే మాంసాన్ని విక్ర‌యిస్తానని కూడా ప్ర‌క‌టించాడు. ప్ర‌చార‌మూ చేశాడు.

ఊహూ! క‌న్నెత్తి చూసేవారు కూడా లేరు.. అత‌ని షాపు వైపు. దీనితో ఓ మాంఛి కిక్ ఇచ్చే ఐడియా త‌ట్టింద‌త‌నికి. రాత్రికి రాత్రే ఆ ఐడియాను అమ‌ల్లోకి తెచ్చాడు.

కాస్త ఖ‌ర్చ‌యినా భ‌రించాల‌నుకున్నాడు. వెన‌క్కి తిరిగి చూల్లేదు. ఓ అంద‌మైన యువ‌తిని సేల్స్‌గ‌ర్ల్‌గా పెట్టుకున్నాడు. ఆరామ్‌గా గ‌ల్లా పెట్టే ద‌గ్గ‌ర కూర్చున్నాడు.

పొట్టి దుస్తులు వేసుకుని, మాంసాన్ని విక్ర‌యిస్తోన్న ఆ యువ‌తి ఉన్న షాప్‌న‌కు బారులు తీరారు జ‌నం. ఒక్క రోజులోనే రెండింత‌ల ఆదాయాన్ని చ‌వి చూశాడు ఆ షాపు య‌జ‌మాని.

తైవాన్‌లోనిది ఈ ఘ‌ట‌న‌. ఆ యువ‌తి పేరు వివి. అది ఆ ముద్దుగుమ్మ ముద్దుపేరు. తైవాన్‌లోని తైఛుంగ్ ప్రావిన్స్‌లో ఉన్న బైట‌న్ డిస్ట్రిక్ట్‌లో ఉందీ షాప్‌. ఆ షాప్ పేరు లిటిల్ పీచ్‌.

మాంసాన్ని క‌ట్ చేయ‌డంలో ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి మ‌రీ పిలిపించుకున్నాడా ఓన‌ర్‌. ఒక్క రాత్రే అత‌ని ఆదాయం రెండింత‌ల‌కు మించిపోయింది.

స‌మ్మోహ‌నంగా న‌వ్వుతూ, హ‌స్కీ వాయిస్‌తో ఆమె ప‌ల‌క‌రిస్తోంటే..జ‌నం ఆ షాపు ముందు బారులు తీరుతున్నారు. అమ్మాయిలు కూడా ముందువ‌ర‌స‌లో ఉంటున్నార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here