క‌`ర్నాట‌కం`లో అస‌లు అంకం: య‌డ్యూర‌ప్పకు గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం..నేడు ప్ర‌మాణం

హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డిన క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో అస‌లు అంకానికి తెర లేచింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా.. బీజేపీని ఆహ్వానించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆ పార్టీని ఆయ‌న ఆహ్వానించారు. దీనితో గురువారం ఉద‌యం 9:30 గంట‌ల‌కు య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ‌కు ఆ పార్టీకి 11 రోజుల గ‌డువు ఇచ్చారు.

గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన 11 రోజుల గ‌డువు లోగా య‌డ్యూర‌ప్ప నేతృత్వంలో ఏర్పాటు కాబోయే బీజేపీ ప్ర‌భుత్వం అసెంబ్లీలో త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. నిజానికి- ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన 112 సీట్ల సంఖ్యాబ‌లం లేదు. కాంగ్రెస్‌-జేడీఎస్ పొత్తును నిలువ‌రించ‌డానికే గ‌వ‌ర్న‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు. దీనిపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here