విజయ్ మాల్యాగా నటించబోతున్న ఈ టాప్ హీరో ఎవరో తెలుసా..?

విజయ్ మాల్యా.. వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశాడు. ఇప్పటికే కొందరు విజయ్ మాల్యా క్యారెక్టర్ ను తెర మీదకు తీసుకొని వచ్చారు కానీ అంతగా సక్సెస్ కాలేదు. అందుకు ముఖ్య కారణం పెద్ద యాక్టర్ ఎవరూ ఆ క్యారెక్టర్ చేయడానికి ముందుకు రాకపోవడం అయిండొచ్చు. త్వరలో ఓ టాప్ యాక్టర్ విజయ్ మాల్యా అవతారంలో సినిమాలో సందడి చేయబోతున్నాడు. ఆయన ఎవరో కాదు గోవిందా..!

హా.. బాలీవుడ్ యాక్టర్ గోవిందా మాల్యాగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు మాజీ ఛీఫ్ అయిన పెహ్లాజ్ నిహ్లానీ దర్శకత్వం వహించబోతున్న రంగీలా రాజా సినిమాలో గోవిందా విజయ్ మాల్యా అవతారంలో కనిపించబోతున్నాడు. విజయ్ మాల్యా ఎలా బ్యాంకులను మోసం చేసాడో అదంతా చూపించడమే కాకుండా అమ్మాయిలతో అతడు ఎలా ఉండే వాడో కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. గోవిందా కూడా సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమే అయింది. త్వరలో మరోసారి ఆయన స్టైల్ వెండితెర మీద చూస్తారని దర్శకుడు చెబుతున్నాడు. విజయ్ మాల్యా అని చెప్పను కానీ మన దేశంలో పెద్ద స్క్యామ్ చేసిన వ్యక్తికి సంబంధించిన సినిమా అనీ పెహ్లాజ్ చిన్న హింట్ ఇచ్చారు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here