మన గ్రాండ్‌ మాస్టర్‌ హరికృష్ణకు పెళ్ళి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

చదరంగంలో భారత్ కీర్తిని ప్రపంచ నలుదిక్కులకు ఇనుమడింపజేస్తున్న వారిలో తెలుగుతేజం గ్రాండ్‌ మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఒకరు. త్వరలోనే హరికృష్ణ పెళ్ళి చేసుకోబోతున్నాడు. అయితే అమ్మాయి ఎవరో తెలుసా..? ఓ సెర్బియా దేశస్థురాలు. ఇంతకూ వీరి ప్రేమ ఎక్కడ మొదలైందనేగా.. హరికృష్ణ అంతర్జాతీయ స్థాయిలో చెస్ పోటీల్లో పాల్గొనేందుకు సెర్బియాకు వెళ్ళాడు.. అక్కడ సెర్బియా చెస్‌ క్రీడాకారిణి నదెడ్జాతో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలిసింది. అందుకు వారు ఒప్పుకోవడంతో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది.

తాను వివాహం చేసుకోనున్న విషయాన్ని హరికృష్ణ మీడియాకు తెలిపాడు. మార్చి 3వ తేదీన హైదరాబాద్‌ లోని నోవాటెల్‌ హోటల్ లో తమ పెళ్లి జరుగుతుందని చెప్పాడు. తనకు కాబోయే భార్య ఫోటోతో కూడిన వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని మీడియాకు విడుదల చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here