మంచాన ప‌డ్డ 90 ఏళ్ల అమ్మమ్మ‌ను తిట్టి, కొట్టి, ఈడ్చి అవ‌త‌ల ప‌డేసిన మ‌న‌వ‌రాలు!

తిరువ‌నంత‌పురం: క‌ంటికి రెప్ప‌లా చూసుకోవాల్సిన అమ్మమ్మ‌పై పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించింది ఓ మ‌న‌వ‌రాలు. ఆమెను తిట్టి, కొట్టి, ఈడ్చి అవ‌త‌ల ప‌డేసింది. బ‌ట్ట‌లు ఊడ‌దీసి మ‌రీ కొట్టింది. 90 ఏళ్లు పైబ‌డ్డ వృద్ధురాలు అని కూడా చూడ‌లేదు. ఇష్టానుసారంగా కొట్టింది. నిశ్చేత‌నురాలై ప‌డి ఉన్న ఆమెను చెప్పుతోనూ చిత‌క‌బాదిందా కిరాత‌కురాలు.

 

ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని క‌న్నూర్‌లో చోటు చేసుకుంది. ఆ మ‌న‌వ‌రాలి ఆకృత్యాన్ని ఇరుగుపొరుగు వారు వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమెపై మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌లోనూ ఫిర్యాదు చేశారు. బాధిత వృద్ధురాలి పేరు క‌ల్యాణి.

ఆమె మ‌న‌వ‌రాలి పేరు దీప‌. క‌ల్యాణిని రోజూ తిట్ట‌డం, కొట్ట‌డం ఆమె ప‌నిగా పెట్టుకుంది. స్థానికులు అడ్డు ప‌డిన‌ప్ప‌టికీ.. వినిపించుకునేది కాదు. దీనితో వారు. దీప వృద్ధురాలిని కొడుతున్న దృశ్యాన్ని మొబైల్‌లో బంధించారు.

ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా కేర‌ళ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ దృష్టికి చేరింది. దీనితో క‌మిష‌న్ అధికారులు సుమోటోగా కేసు న‌మోదు చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాల‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు.. దీప‌ను అరెస్టు చేశారు.

https://www.facebook.com/shihab.zaini.7/posts/2014074848913736

Kayalpatnamさんの投稿 2018年3月18日(日)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here