ఫస్ట్ నైట్ రోజే డెత్ నోట్ రాశాడు.. భార్యతో తమ్ముడికి పెళ్లిచేయండి.. సోమవారం పెళ్ళి జరిగింది..!

పెళ్ళి చేసుకున్న తర్వాతి రోజే పెళ్ళికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ నైట్ రోజే డెత్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లాలోని సూలికుంటె గ్రామంలో చోటుచేసుకుంది. చనిపోతూ చనిపోతూ తన భార్యను తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేయమని కోరాడు.

సూలికుంటె గ్రామానికి చెందిన 30 ఏళ్ల మునిరాజుకు అక్క కూతురితో సోమవారం నాడు బంధుమిత్రులు వైభవంగా పెళ్లి జరిపించారు. వివాహం తరువాత ఇంటికి వచ్చిన దంపతులను తొలిరాత్రి నిమిత్తం గదిలోకి పంపారు. అయితే తెల్లవారుజామున ఫ్యానుకు ఉరేసుకుని మరణించాడు.

ఫస్ట్ నైట్ రోజే మునిరాజు డెత్ నోట్ రాశాడు. అక్క కూతురిని చేసుకోవడం తనకు ఇష్టం లేదని అందులో రాశాడు. పెద్దల బలవంతం మీదనే పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. తమ సోదరుడికి ఆమెను ఇచ్చిన మళ్లీ పెళ్లి చేయాలని సూచించాడు. ఫస్ట్ నైట్ సమయంలో భార్యతో అంటీముట్టనట్టుగానే మునిరాజు ప్రవర్తించాడు. ఈ ఆత్మహత్యపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here