చెవిలో ఓ మాట చెప్పేసి పెళ్ళి మంటపం నుండి వెళ్ళిపోయిన పెళ్ళికొడుకు.. మంటపంలో అలాగే కూర్చున్న వధువు..!

ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో మంగళవారం నాడున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ సామూహిక వివాహ వేడుకను నిర్వహిస్తున్నారు. 52 జంటలకు పెళ్ళి జరిపిస్తున్నారు. ఇంతలో ఓ వరుడు పెళ్ళి కూతురు దగ్గరకు వెళ్ళి చెవిలో ఓ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెళ్ళి కూతురు బంధువులు అతడి గురించి వెతకడం మొదలుపెట్టారు. ఇంతలో వరుడి కుటుంబసభ్యులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. పాపం వధువు మాత్రం అతడు వస్తాడని అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోయింది. మిగిలిన జంటలకు పెళ్ళి జరుగుతుంటే ఆమె చూస్తూ ఉండిపోయింది.

ఇంతకూ చెవిలో ఏమి చెప్పాడు:
వధువు స్నేహ లత పెళ్ళి, రుకమ్ పాల్ సింగ్ తో నిర్ణయించారు. సామూహిక వివాహాల్లో వీరి పెళ్ళి కూడా ఓ భాగమే. అందరి లాగే రుకమ్ పాల్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్ళి వేదిక వద్దకు చేరుకున్నాడు. ఇక కార్యక్రమం మొదలయ్యే కొన్ని నిమిషాలే ముందు రుకమ్ పాల్ వధువు చెవిలో ఒక మాట చెప్పాడు. అదేమిటంటే టాయ్ లెట్ వెళ్ళి వస్తాను అని. నవ్వుకున్న వధువు సరే అని చెప్పింది. అరా గంట అయినా కూడా వరుడు రాలేదు. పెళ్ళి కొడుకును వెతకడానికి వెళ్ళిన అతడి కుటుంబ సభ్యులు కూడా కనిపించలేదు.

దీంతో ఎదురుచూసిన వధువు ఎంతో బాధతో అక్కడే కొద్దిసేపు ఉండిపోయింది. అందరి పెళ్ళి జరుగుతుంటే తాను మాత్రం చూస్తూ ఉండిపోయింది. తర్వాత అమ్మాయి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పెళ్ళి కొడుకు 4 లక్షల రూపాయలు కట్నం అడిగాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు పెళ్ళి కొడుకును వెదికే పనిలో పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here