సెల్ఫీ పేరుతో వ‌రుడు ఎక్క‌డెక్క‌డో తాక‌డంతో చిరాకెత్తిన వ‌ధువు..చివ‌రి నిమిషంలో పెళ్లి ర‌ద్దు!

పీట‌ల దాకా వ‌చ్చిన పెళ్లి ఆగిపోయిన సంద‌ర్భాలు, సంఘ‌ట‌న‌ల‌ను వెండి తెర మీదే కాదు.. నిజ జీవితంలోనూ చూసి ఉంటాం. అడిగినంత క‌ట్నం ఇవ్వ‌లేద‌నో లేక పెళ్లి కుమార్తె త‌ర‌ఫు బంధువులు మ‌ర్యాద స‌రిగ్గా చేయ‌లేద‌నో కార‌ణాల‌ను చూపుతూ..ర‌ద్ద‌యిన పెళ్లిళ్లు కూడా చాలానే ఉన్నాయి. వాట‌న్నింటికీ భిన్నమైన ఘ‌ట‌న ఇది.

గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో చోటు చేసుకుంది. అహ్మ‌దాబాద్ ర‌మోలా ప్రాంతంలో నివ‌సించే యువ‌తికి వ‌స్త్రాల్ ప్రాంతానికి చెందిన సంజ‌య్ చౌహాన్‌తో వివాహం నిశ్చ‌య‌మైంది. ఈ నెల 11వ తేదీన వారి వివాహం. వ‌స్త్రాల్ ప్రాంతంలోని ఓ ఫంక్ష‌న్ హాల్‌ను దీనికోసం బుక్ చేశారు. పెళ్లికి ముందురోజు రాత్రి వ‌రుడు, అత‌ని త‌ర‌ఫు బంధువులు, స్నేహితులు ఊరేగింపుగా పెళ్లి మంట‌పానికి చేరుకున్నారు.

రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో సంజ‌య్ చౌహాన్‌.. త‌న స్నేహితుల‌తో క‌లిసి వధువు గ‌దికి వెళ్లాడు. ఆమెతో క‌లిసి సెల్ఫీ తీసుకోసాగాడు. నాలుగైదు సెల్ఫీల త‌రువాత ఇక చాలంటూ వ‌ధువు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీనితో సంజ‌య్ చౌహాన్ ఆగ్ర‌హించాడు. ఇద్ద‌రి మ‌ధ్యా మాటా మాటా పెరిగింది.

ఈ విష‌యం తెలుసుకున్న వ‌ధువు తండ్రి. వ‌రుడిని స‌ర్దిచెప్ప‌బోయాడు. అయిన‌ప్ప‌టికీ.. అత‌ను ప‌ట్టించుకోక‌పోగా.. వ‌ధువు తండ్రిపై చేయి చేసుకున్నాడు. దీనితో పెళ్లిని ర‌ద్దు చేశారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌ధువు తండ్రి ర‌మోలా పోలీస్‌స్టేష‌న్‌లో సంజ‌య్‌పై కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here