`నువ్వు సింహానివా? గియ్య‌రా గెడ్డం!`

తుప్పుప‌ట్టిన రేజ‌ర్, బ్లేడ్‌తో త‌న ముఖాన్ని సెల్‌ఫోన్‌లో చూసుకుంటూ షేవింగ్ చేసుకుంటున్న ఆ యువ‌కుడి పేరు రంజిత్ థాకూర్ సింహ్‌. ఓబీసీకి చెందిన యువ‌కుడు. అత‌ని పేరు చివ‌ర `సింహ్‌` అని ఉండ‌టం.. ఆ గ్రామంలోని కొంద‌రు అగ్ర‌వ‌ర్ణ యువ‌కుల‌కు న‌చ్చ‌లేదు. `నువ్వు సింహానివా?` అని ఎద్దేవా చేస్తూ బ‌ల‌వంతంగా అత‌నితో షేవింగ్ చేయించారు.

మీసాలు కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం నున్న‌గా గీయించారు. దీనికి ముందు- న‌లుగురు క‌లిసి ఆ యువ‌కుడిని కొట్టారు. గాయాల‌పాలు చేశారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని బ‌న‌స్కాంత జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పాల‌న్‌పూర్ తాలూకా గోఢ్ గ్రామంలో నివ‌సించే రంజిత్ థాకూర్ ఓబీసీకి చెందిన యువ‌కుడు.

సాధార‌ణంగా ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి పేరు చివ‌ర `సింహ్‌` అని ఉంటుంది. వారు ఇలా పేరు పెట్టుకోవ‌డం ఆ గ్రామంలో నివ‌సించే అగ్ర‌వ‌ర్ణ రాజ్‌పుత్ సామాజిక వ‌ర్గ యువ‌కుల‌కు న‌చ్చ‌లేదు. దీనితో వారు పొలం ప‌నుల‌కు వెళ్లి, ఇంటికి తిరిగి వ‌స్తోన్న రంజిత్ థాకూర్‌ను అడ్డగించి, కొట్టారు.

అనంత‌రం బ‌ల‌వంతంగా గెడ్డం, మీసాలు తీయించారు. ఈ నెల 27వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న తాలూకూ వీడియో సోష‌ల్ మీడియాలో షేర్ అవుతోంది. దీనిపై స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. నిందితుల‌ను అరెస్టు చేస్తామని, వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పాల‌న్‌పూర్ సీఐ నీర‌జ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here