అక్రమ సంబంధం అనుమానం ఆ బాలిక‌ను..!

తన భర్త పక్కింటి యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు రావడంతో అత‌ని భార్య ఓ దారుణ కార్యానికి ఒడిగట్టింది. భ‌ర్త‌తో పాటు ఆ యువ‌తికీ శిక్ష విధించింది. స‌ల‌స‌ల కాగే నూనెలో చెయ్యి పెట్టాల‌ని ఆదేశించింది. ఇద్ద‌రి సచ్ఛీలత నిరూపించుకోవాలంటూ నూనెలో ఇద్దర్నీ బలవంతంగా చేతులు పెట్టించింది. దీంతో 17 ఏళ్ల యువతితో పాటు ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని భ‌గ‌వ‌తి పారా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ మ‌హిళ పేరు సుమ‌న్ ప‌ర్మ‌ర్‌. భ‌గ‌వ‌తి పారా ప్రాంతంతో కొన్నేళ్లుగా భ‌ర్త రాహుల్ ప‌ర్మ‌ర్‌తో క‌లిసి నివ‌సిస్తున్నారు. ఆమె పొరుగింట్లో ఉన్న కుటుంబంలో 17 సంవ‌త్స‌రాల యువ‌తి ఉంటోంది. ఆ యువితో త‌న భ‌ర్త‌కు అక్ర‌మ సంబంధం ఉంద‌నే అనుమానంతో సుమ‌న్ ప‌ర్మ‌ర్ ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టింది.

ఇద్ద‌ర్నీ బ‌లవంతంగా కాగుతున్న నూనెలో చేతులు పెట్టించింది. ఈ ఘ‌ట‌న‌లో ఆ మైన‌ర్ బాలిక అర‌చేతులు బొబ్బ‌లెక్కాయి. రాహుల్‌కు స్వ‌ల్పంగా గాయ‌ల‌య్యాయి. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు రాహుల్‌, సుమ‌న్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువ‌తిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె రాజ్‌కోట్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here