తల్లీకూతుళ్ళు నడుపుతున్న షాప్ కు పెద్ద గన్ తీసుకొని దొంగతనానికి వచ్చాడు.. వాళ్ళే..!

తల్లీకూతుళ్ళు మాత్రమే ఆ షాప్ లో ఉంటారులే.. కావాల్సినంత డబ్బులు వారి దగ్గర ఉంటాయి డబ్బులు కొట్టేద్దామని ఓ దొంగ తన దగ్గర ఉన్న షాట్ గన్ ను తీసుకొని వచ్చాడు. మొదట కౌంటర్ లో ఉన్న కూతురుని బెదిరించి డబ్బులు తీసుకొన్నాడు. ఇంతలో ఆమె తల్లి తుపాకీ తీసుకొని అతడిని వెనుక నుండి కాల్చిపడేసింది. ఈ ఘటన అమెరికా.. ఓక్లహామా రాష్ట్రం లోని టుస్లాలో చోటుచేసుకుంది.

ఫారెస్ట్ ఎకర్స్ లిక్కర్ షాప్ లో 30 సంవత్సరాల యాష్లే లీ కౌంటర్ లో ఉంది. ఆమె పక్కనే తల్లి అయిన 53 సంవత్సరాలా టీనా రింగ్ కూడా ఉంది. ఇంతలో గన్ను పట్టుకొని ఓ దొంగ వారిని బెదిరించాడు. అతడిని చూడగానే లీ భయపడిపోతూ చేతులు పైకి పెట్టి క్యాష్ కౌంటర్ లో నుండి బయటకు వచ్చేసింది. ఆమె తల్లి టీనా కూడా పక్కకు జరిగింది. ఇంతలో ఆ వ్యక్తి క్యాష్ కౌంటర్ లో ఉన్న కొంత డబ్బును తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అంతలో క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న గన్ ను టీనా చేతిలో పట్టుకుంది.

ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆ దొంగ మళ్ళీ వెనుకకు వచ్చాడు. ఈసారి గన్ను చేతపట్టిన టీనా అతడిని కాల్చేసింది. వెంట కూడా పడింది. మళ్ళీ అతడు టీనా వెంటపడి స్టోర్ లోపలికి వచ్చాడు. టీనా దగ్గర ఉన్న గన్ ను లాక్కోవాలని ప్రయత్నించాడు. ఇంతలో ఆమె కూతురు లీ కూడా తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీసింది. అతడిని వెనుక నుండి కాల్చివేసింది. టీనాను అతడు వదిలిపెట్టగానే వారిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. సీసీటీవీ ఫుటేజీలో ఆ వ్యక్తి కుప్పకూలడం కూడా గమనించవచ్చు. దొంగతనానికి వచ్చిన వ్యక్తిని టిరాన్ లీ గా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి బుల్లెట్ గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు గుర్తించారు. తాను తన కూతురుకి ఏమీ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే కాల్చానని టీనా చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరు మహిళలు చేసిన పోరాటాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here