ఇదీ గుండు హనుమంతరావు కొడుకు గొప్పతనం.. ఉద్యోగాన్ని వదిలేసి అన్నీ తానై తండ్రికి తోడుగా..!

ప్రముఖ తెలుగు కమెడియన్ గుండు హనుమంతరావు మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆయన కొడుకు ఆదిత్యను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అయితే ఆదిత్య గొప్పతనం మాత్రం ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ గుండు హనుమంతరావుకు దేవుడు మంచి కొడుకును ఇచ్చాడయ్యా అని అంటూ ఉన్నారు.

ఎందుకంటే ఆదిత్య తండ్రి కోసం అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాడు. ఈ కాలంలో కావాల్సిన వాళ్ళు పోతేనే చూడడానికి విదేశాల నుండి రారు.. అలాంటిది తన తండ్రికి బాగాలేనప్పుడు ఎలాగైనా బతికించుకోవాలని చాలా కష్టాలే పడ్డాడు ఆదిత్య. అమెరికాలో ఎంఎస్‌ను పూర్తి చేసుకున్న ఆదిత్య ఉద్యోగంలో చేరే సమయంలో తన తండ్రికి ఆరోగ్యం బాలేదని తెలిసింది. దీంతో వెంటనే అక్కడి నుంచి వచ్చేశాడు. అప్పటికే తన తల్లి, సోదరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతూ బాధపడుతున్న గుండు హనుమంతరావుకు అన్నీ తానై అయ్యాడు. హనుమంతరావుకు చికిత్స చేసే సమయంలో 24 గంటల పాటు తండ్రికి పక్కనే ఉంటూ.. అతడికి సేవలు చేస్తూ ఉండిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here