ప్రేమికుల రోజు స్పెషల్.. అతడిని అమ్మాయిలు అద్దెకు తీసుకొని వెళ్ళవచ్చట..!

ప్రేమికుల రోజు ఈ వ్యక్తి అమ్మాయిలకు కొత్త కొత్త ఆఫర్లు ఇస్తున్నాడు. అలాగని ఇతడు ఏదో షాప్ పెట్టి.. అమ్మాయిలకు ప్రత్యేకంగా డిస్కౌంట్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇతడు అద్దెకు ఇస్తుంది తననే..! గురుగ్రామ్ కు చెందిన ఈ యువకుడు ప్రేమికుల దినోత్సవం రోజున ఎవరైనా అమ్మాయిలు తనను తీసుకొని వెళ్ళవచ్చునని ఆఫర్ ఇస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్ ఆన్ రెంట్ అనే ప్రత్యేక ఆఫర్ ను షకుల్ గుప్తా అనే కుర్రాడు ఇస్తున్నాడు.

26సంవత్సరాల షకుల్ గుప్తా ఫేస్ బుక్ లో తాను ప్రేమికుల రోజున అద్దెకు దొరుకుతానని కావాలంటే 4 ఆఫర్లు కూడా ప్రకటించాడు. ఒంటరి మహిళలకు తోడు కావాలంటే తనను తీసుకొని వెళ్ళవచ్చునని పోస్ట్ చేశాడు. ‘RICHGUY’అనే ప్రోమో కోడ్ వాడితే తన ఆడి కారులో ఫ్రీగా తీసుకొని వెళ్ళడమే కాకుండా 20శాతం డిస్కౌంట్ కూడా ఇస్తాడట. అయితే ఇతడికి ఎంత అద్దె ఇవ్వాలో ఎవరికీ తెలియదు. తనకు తెలిసిన చాలా పనులు చేస్తానని.. ముద్దుల దగ్గర నుండి మీకు ఏది కావాలంటే అది చేస్తాను అని ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇతడి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 78వేల మందికి పైగా అతడి పోస్టును లైక్ చేయగా.. 3,650 మంది షేర్ చేశారు.

 

అయితే అతడు ఇలా ఆఫర్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏడాది కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చాడు. ఏకంగా అయిదు మంది ముద్దుగుమ్మలతో అతడు ఒబెరాయ్ హోటల్ లో డిన్నర్ చేశాడు. అలాగే ఐఫోన్ 7 మొబైల్స్ కూడా ఇచ్చాడట.

VALENTINE'S DAY BOYFRIEND RENTAL 00:00 – 23:59 14th Feb 2018 Package 1:Holding hands & putting arm around the…

Shakulさんの投稿 2018年2月10日(土)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here