బీటెక్ లో తొమ్మిది సబ్జెక్ట్స్ ఫెయిల్ అయింది.. ఇది తెలిసీ తల్లిదండ్రులు ఏమీ అనలేదని..!

హా.. మీరు చదివింది నిజమే.. సాధారణంగా పిల్లలు సరిగా చదువుకోకపోతే తల్లిదండ్రులు మందలించడం మన దేశంలో సర్వ సాధారణమే..! కొందరు అయితే తమ పిల్లలు చదువుకోకపోతే ఎందుకూ పనికిరారని.. వేరే వాళ్ళు ఎలా చదువుతున్నారో చూసి నేర్చుకో అంటూ ప్రతిరోజూ ఒకటే పద్యాలే పాడుతూ ఉంటారు.

అయితే ఈ బీటెక్ విద్యార్థిని చదువుకు మాత్రం మరో కారణం ఉందని చెబుతున్నారు. ఆ అమ్మాయి తొమ్మిది సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయినా కూడా తల్లిదండ్రులు ఏమీ అనలేదట.. అందుకని ఆమె ఆత్మహత్య చేసేసుకుంది. తాను పరీక్షలు తప్పినా తల్లిదండ్రులు ఏమీ అనలేదన్న కారణంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరులో చోటుచేసుకుంది. మాజీ ఎంపీటీసీ సూరా సుబ్బులు మనవరాలు, వైకాపా నేత వెంకటరెడ్డి కుమార్తె గురులక్ష్మి తెనాలిలోని ఓ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. తొమ్మిది సబ్జెక్టుల్లో తప్పినప్పటికీ, ఆమెను ఎవరూ మందలించలేదు. తనను ఎవరూ మందలించకపోవడంతో మరింత బాధపడిన ఆమె, శుక్రవారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here