గురుకుల్ స్కూల్ టీచ‌ర్ హాస్ట‌ల్ రూమ్‌లో..ఉరి వేసుకున్న స్థితిలో!

భువ‌నేశ్వ‌ర్‌: ప‌్ర‌తిష్ఠాత్మ‌క టైమ్స్ గురుకుల్ స్కూల్ అది. ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ శివార్ల‌లోని గోత‌ప‌ట్న గ్రామంలో ఉంటుందీ స్కూల్‌. అంత‌ర్జాతీయ స్థాయి విద్య‌ను బోధిస్తుంటార‌నే పేరుంది. విద్యార్థుల‌తో పాటు బోధ‌న‌, బోధ‌నేతర సిబ్బందికి కూడా ఆ స్కూల్ క్యాంప‌స్‌లోనే హాస్ట‌ల్ వ‌స‌తిని క‌ల్పించింది యాజ‌మాన్యం.

ఆ హాస్ట‌ల్ గ‌దిలో ఉపాధ్యాయురాలు ఒక‌రు అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. హాస్ట‌ల్‌లోని త‌న గ‌దిలో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె క‌నిపించారు. జ‌గ‌త్‌సింగ్‌పూర్‌కు చెందిన కాదంబిని రేగా గుర్తించారు.

ఆమె మృత‌దేహాన్ని చూసిన వెంట‌నే హాస్ట‌ల్ వార్డెన్ చండ‌క పోలీస్‌స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌టనాస్థ‌లానికి చేరుకుని, మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

27 సంవ‌త్స‌రాల కాదంబిని ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటుంద‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక అందిన త‌రువాత ఆమె మ‌ర‌ణం స‌హ‌జ‌మా? కాదా? అనేది తేలుతుంద‌ని పోలీసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here