సినిమా  రెస్పాన్స్ బాగుంది – హ్యాపీ వెడ్డింగ్ దర్శకుడు లక్ష్మణ్ కార్య 

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ఈచిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ సందర్బంగా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయినా లక్ష్మణ్ కార్య చెప్పిన విశేషాలు ..

 సినిమా రెస్పాన్స్  చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు అమ్మాయిలనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అలాగే ఓవర్సీస్ నుండి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయ్.  నేను ఇంతకుముందు సుమంత్ అశ్విన్ తో ఎందుకిలా ? అనే వెబ్ సిరీస్ చేస్తున్నపుడు ఆయనకు ఈ కథ చెప్పాను ఆ తరువాత ఆయన పాకెట్ సినిమాస్ ను పరిచయం చేశారు వారికీ కూడా కథ నచ్చడంతో సినిమా చేశాం.

నిహారిక కంటే ముందు మ‌రో ఇద్ద‌రిని ప‌రిశీలించాం
ఈ  కథ అంతా హీరోయిన్ చుట్టూ తిరిగేది కావడంతో ఈ పాత్రకు తెలుగు అమ్మాయి అయితే కరెక్ట్ అనిపించిందని ల‌క్ష్మ‌ణ్ వివ‌రించారు. నిహారికకు ముందు మరో ఇద్దరి పేర్లను ప‌రిశీలించాం . కానీ ఎందుకో ఈ పాత్రకు ఆమె అయితేనే బాగుంటుందని అందరం అనుకోని ఆమెను తీసుకున్నాం. మొదటి సినిమాతోనే నరేశ్, మురళి శర్మ వంటి సీనియర్ నటులను డైరెక్ట్ చేసే అవకాశం అది ప్రొడక్షన్ హౌస్ కలిపించిన అదృష్టం . సెట్ లతో వారితో ఎలాంటి ఇబ్బంది రాలేదు. షూటింగ్ జరుగుతున్నపుడు సీన్ పేపర్ చూసుకుని ఎలా చేస్తే బాగుంటుందని అనుకోవడం… అలా వారితో సరదాగా గడిచిపోయింది. నాగబాబు గారు  సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆయన ఆలా అనడంతో నాకు చాలా సంతోషమేసింది.

నిహారిక కూడా హ్యాపీ
హ్యాపీ వెడ్డింగ్ క‌థా నాయిక‌ నిహారిక  సినిమా చూశాక నాకు ఫోన్ చేసి సార్ నా లైఫ్ లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోయిందంటూ ఆనందం వ్య‌క్తం చేసింద‌ని లక్ష్మ‌ణ్ చెప్పారు.  తదుపరి చిత్రం గురించి చెప్పాలంటే ప్రస్తుతం స్టోరీ నరేషన్ జరుగుతుంది త్వరలోనే కొత్త సినిమా కు సంభందించిన వివరాలను ప్రకటిస్తా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here