రవీంద్ర జడేజా నువ్వు ‘సర్ రవీంద్ర జడేజా’ ఎలా అయ్యావు అని అడిగిన భజ్జీ..!

సాధారణంగా మన క్రికెటర్లకు ఒక్కొక్కరికి ఒక్కో ముద్దు పేరు ఉంటుంది. కానీ రవీంద్ర జడేజాను జడ్డు అని అనడమే కాకుండా వెరైటీగా ‘సర్ రవీంద్ర జడేజా’ అని పిలుస్తారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్.. అయితే ఈ ప్రశ్నకు హర్భజన్ సింగ్ రవీంద్ర జడేజా ముందు ఉంచాడు. ఈ పేరు గురించి తనకు ఏమీ సంబంధం లేదని.. మొత్తం ధోనినే చేశాడని చెప్పేశాడు జడేజా..!

ఒక రోజు తనను సోషల్ మీడియాలో ధోని ‘సర్ రవీంద్ర జడేజా’ అని పిలిచేసాడని. తనను కావాలనే పొగడడం మొదలుపెట్టిన ధోని తన గురించి చాలా ఎక్కువగా బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టాడని చెప్పాడు. అంతేకాకుండా రజనీకాంత్ జోక్స్ అన్నీ తన మీద వేయడం మొదలు పెట్టాడని.. అందుకే అలా తన పేరు ఫిక్స్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడే తాను భారతజట్టులో చోటు సంపాదించానని.. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తన ప్రయాణం మొదలైనప్పటి నుండి ధోని తనకు వెన్నుగా నిలిచాడని చెప్పాడు జడేజా.. ఎంతో నవ్వులు కురిపించే ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కావాలంటే మీరు కూడా చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here