హార్ధిక్ పాండ్య‌ను క్లీన్ బౌల్డ్ చేసేసిందిగా! ఆమెతో డేటింగ్‌లో ఉన్నాడ‌ట‌..!

ముంబై: మ‌రో క్రికెట‌ర్ ప్రేమ‌లో ప‌డ్డాడు. అది కూడా ఓ అప్ క‌మింగ్ బాలీవుడ్ యాక్ట్రెస్‌తో. పేరు ఎల్లీ అవ్‌రామ్‌. ఊరు స్వీడ‌న్‌. టీమిండియాలో జూనియ‌ర్ క‌పిల్‌దేవ్‌గా గుర్తింపు పొందిన హ‌ర్ధిక్ పాండ్య ఆమెతో డేటింగ్ కూడా చేస్తున్నాడ‌ట‌.

మ‌న‌దేశంలో బిగ్‌బాస్-7 సీజ‌న్‌లో పాల్గొన్న‌ది ఎల్లీ. ఒక్క బాలీవుడ్డే కాదు..త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది. త‌మిళంలో కాజ‌ల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న `ప్యారిస్ ప్యారిస్‌` సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది ఎల్లీ.

క‌న్న‌డంలో కూడా బ‌ట‌ర్ ఫ్లై అనే మూవీలో న‌టించ‌బోతోంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌టికొచ్చిన త‌రువాత బాలీవుడ్‌లో మంచి ఆఫ‌ర్లే వ‌చ్చాయి. మిక్కీ వైర‌స్‌, కిస్ కిస్ సె ప్యార్ క‌రూ, నామ్ ష‌బానా, పోస్ట‌ర్ బోయ్స్ సినిమాల్లో న‌టించింది.

ఆమెతో క‌లిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించాడు హార్ధిక్ పాండ్య‌. ఆ త‌రువాత త‌న సోద‌రుడు, క్రికెట‌ర్ కృనాల్ పాండ్య పెళ్లి రిసెప్ష‌న్‌లోనూ ఎల్లీతో చెట్టాప‌ట్టాలేసుకుని ఫొటోల‌కు ఫోజిచ్చాడు. ఆమెతో డేటింగ్‌లో ఉన్న‌ట్టు కూడా క్లియ‌ర్‌గా చెప్పేశాడ‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here