హాలీవుడ్ లైంగిక వేధింపుల నిర్మాత చెంప ఛెళ్లుమనిపించారు..!

హార్వీ వీన్‌స్టీన్‌.. గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న పేరు..! అలాగని ఈ హాలీవుడ్ నిర్మాత ఏదో పెద్ద కళాఖండాన్ని తీశాడని కాదు.. చేసిన పాడు పనుల గురించి..! ఎంతో మంది నటీమణులను లైంగికంగా వేధించాడు హార్వీ. అతడు చేసిన పనులు ఒకదాని తర్వాత మరొకటి బయటపెట్టుకుంటూ వచ్చారు. తాజాగా అతడిని ఓ వ్యక్తి వాయిస్తున్న వీడియో బయటకు వచ్చింది.

హార్వీ వీన్‌స్టీన్‌ జ‌న‌వ‌రి 9 రాత్రి స‌మ‌యంలో అరిజోనాలో ఉన్న ప్యార‌డైజ్ రెస్టారెంట్‌కి వ‌చ్చాడు. అక్క‌డ ఓ వ్య‌క్తి ఫొటో దిగాల‌ని కోరాడు. అందుకు హార్వీ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అత‌ని మీద రెండు సార్లు చేయి చేసుకున్నాడు. మహిళలను ఇబ్బంది పెట్టినందుకు ఈ శాస్తి అని ఆ వ్య‌క్తి అన్నాడు. అందులో హార్వీ వీన్‌స్టీన్ ను బండ బూతులు తిట్టాడు ఆ వ్యక్తి. చెంప దెబ్బ కొట్టిన వ్య‌క్తి, మ‌రో వ్య‌క్తితో వీడియో తీయ‌మ‌ని చెప్పాడు. హార్వీతో వ‌చ్చిన వేరే వ్య‌క్తి వీడియో తీస్తుండ‌గా చేయి అడ్డం పెట్టాడు.

ఈ వీడియోను మొద‌టిసారిగా టీఎంజెడ్ అనే వెబ్‌సైట్ విడుద‌ల చేసింది. అయితే హార్వీ ప్ర‌తినిధులు మాత్రం ఇది ఫేక్ వీడియో అని తేల్చి చెప్పారు. ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here