మ‌రో బాంబు పేల్చిన ష‌మీ భార్య‌..త‌మ్ముడితో అత్యాచారం చేయించ‌బోయాడ‌ట‌!

కోల్‌క‌త‌: టీమిండియా పేస్ బౌల‌ర్ మ‌హమ్మ‌ద్ షమీపై మ‌రో బాంబు ప‌డింది. క‌ట్టుకున్న భార్య‌ను త‌న సోద‌రుడితో అత్యాచారం చేయించ‌బోయాడంటూ ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఈ ఆరోప‌ణ‌లు చేసిందెవ‌రో కాదు.. ష‌మీ భార్య హ‌సీన్ జ‌హాన్‌. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని హసిన్‌ చెబుతున్నారు.

త‌న మ‌రిది హసీబ్ గ‌దిలోకి త‌న‌ను తోశాడ‌ని, బ‌య‌టి నుంచి త‌లుపుల‌కు గ‌డియ పెట్టాడ‌ని హ‌సీన్ జ‌హాన్ చెబుతున్నారు. గ‌ది లోప‌ల హసిబ్ త‌న‌తో అసభ్యంగా ప్రవర్తించాడని, అత్యాచారం చెయ్యబోయాడ‌ని ఆరోపించారు.

తాను గట్టిగా కేకలు వేశానని, దీనితో కొద్దిసేప‌టి త‌రువాత షమీ తలుపులు తెరిచాడని ఆమె వెల్ల‌డించారు. అత‌ని కుటుంబ స‌భ్యులంద‌రూ ష‌మీకే స‌పోర్ట్ చేసే వార‌ని, తాను చెప్పిన ఏ విష‌యాన్ని కూడా వినిపించుకునే వారు కాద‌ని హ‌సీన్ జ‌హాన్ చెప్పారు.

 

మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి పలువురు మహిళలతో అక్ర‌మ సంబంధం ఉంద‌నే విష‌యం త‌న దృష్టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అత్తింటివారి వేధింపులు తీవ్ర‌త‌ర‌మ‌య్యాయ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here