హవాలా రాణి ప్రియ.. పోలీసులతో ఎలా మాట్లాడేదో విన్నారా.. అందంతోనే ఆడుకుంది..!

తమిళనాడు రాష్ట్రంలో హవాలా ప్రియ చేసిన చేసిన పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. పోలీసులతోనూ.. పెద్ద పెద్ద నాయకులతోనూ ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఈమె గురించి అంత ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణం.. ఒక్క మహిళ పన్నులు కట్టకుండా విదేశాల నుండి తక్కువ రేటుకే వస్తువులను తెప్పించేది. వాచ్ ల దగ్గర నుండి కార్ల వరకూ ఈమె విదేశాల నుండి తీసుకొని వచ్చేదంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడైతే ఈమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు..! వెంటనే ఆమెను అదుపు లోకి తీసుకున్నారు.

హవాలా ప్రియ ఈరోడ్ ప్రాంతానికి చెందిన యువతి.. ఈ దండాలు చేసే క్రమంలో ఆమె బెంగళూరులో స్థిరపడిందని అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి డబ్బు తెప్పించడం, ఇక్కడి నుంచి అక్కడికి పంపడం వంటి హవాలా పనులు చేస్తుంటుంది. తాను హవాలా రాణిగా ఎదిగే క్రమంలో తన అందాన్ని అధికారులకు ఎరగా వేసేది. తాజాగా ఆమె ఓ పోలీసు అధికారితో మాట్లాడుతున్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ప్రియను అరెస్ట్ చేశారు.

పూన్ గుండ్రాన్ అనే వ్యక్తి స్పెషల్ బ్రాంచ్ – క్రిమినల్ విభాగంలో పనిచేస్తూ తిరుకొయిలూరులో పని చేస్తున్నాడు. అతను ప్రియతో మాట్లాడుతూ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుంటే హత్య చేయిస్తానని బెదిరిస్తూ మాట్లాడారు. ఈ రికార్డెడ్ కాల్ విల్లుపురం ఏరియాలో తొలుత, ఆపై రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here