ఏ చీర కొన్నా ఒక్క రూపాయికే.. చిన్న కండీషన్..!

బీదర్ వెళితే ఒక్కటంటే ఒకే ఒక్క రూపాయికి చీర అమ్మే షాప్ కనపడుతుంది. ఆ డబ్బులకు ఒక జాకెట్ పీస్ కూడా రాదు అలాంటిది చీర ఎవరు, ఎందుకు ఇస్తారని అంటారా..? అయితే ఈ కథలో తిరుమల వెంకటేశ్వరస్వామి కూడా ఉన్నారు. ఆయన చెబితేనే 5 లక్షల చీరలను ఒక్కొక్కటీ రూపాయికే అమ్మడాన్ని ప్రారంభించాడు బీదర్ లోని ఓ వస్త్రదుకాణం యజమాని చంద్రశేఖర్.

జేడీఎస్ పార్టీ వీరాభిమాని అయిన చంద్రశేఖర్ కు ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధించి, తమ నేత కుమారస్వామి మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాలన్నది ఆయన కోరిక. కొద్ది రోజుల క్రితం వెంకన్న కలలోకి వచ్చి, కుమారస్వామి మళ్లీ సీఎం కావాలంటే, 5 లక్షల చీరలను పంచాలని చెప్పాడట. దీంతో కేవలం ఒక్క రూపాయికే చీరను విక్రయించాలని నిర్ణయించానని, 15 రోజుల పాటు మాత్రమే ఈ స్కీమ్ అమలులో ఉంటుందని చెబుతున్నాడు. అలాగని ఒక్క రూపాయి కాయిన్ తీసుకొని వెళ్తే చీర ఇవ్వడు.. ఒక రూపాయి నోటు.. ఓటర్ కార్డు జిరాక్స్ ఇస్తేనే చీర ఇస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here