బిడ్డను తీసుకొని వెళుతున్న వాహనం వెనుక పరుగెత్తుకుంటూ వెళ్ళిన గోవు..!

తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పండి. గాయపడిన దూడను ఓ వాహనంలో మనుషులు తీసుకొని వెళుతుంటే.. దాని వెనుకనే ఓ ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటక రాష్ట్రం లోని హావేరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జయప్రకాష్ నారాయణ సర్కిల్ వద్ద ఓ దూడ గాయపడింది. దీంతో స్పందించిన స్థానికులు ఆ దూడను ఓ వాహనంలో వేసుకొని స్థానిక పశువుల ఆసుపత్రికి తీసుకొని వెళ్ళబోయారు. దీన్ని చూసిన ఆ దూడ తల్లి ఆ ఆటో వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చింది. దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకూ అలా ఆ ఆవు ఫాలో అవుతూ వెళ్ళింది.

రెండున్నర నెలల దూడను పరీక్షించిన వైద్యులు త్వరలో కోలుకుంటుందని తెలిపారు. దానికి సరైన చికిత్సను అందించి తల్లి వద్దకు చేర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here