ఇంద్ర సినిమాలో తొడకొట్టాడు.. ఇప్పుడు హెబ్బా పటేల్ సరసన హీరోగా నటిస్తున్నాడు..!

ఇంద్ర సినిమాలో నేనున్నా నాన్నమ్మా అంటూ తొడకొట్టిన చైల్డ్ ఆర్టిస్ట్ తేజ గుర్తున్నాడు కదా.. ఇప్పుడు అతను హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అయితే అందులో హీరోయిన్ గా హెబ్బా పటేల్ ను ఎన్నుకున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫైనల్ అయిపోయింది.

కుమారి 21 ఎఫ్ తర్వాత వరుస హిట్లు అందుకున్న హెబ్బా పటేల్.. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మిణుగురులు సినిమా దర్శకుడు అయోధ్య కుమార్ చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఏంజెల్, అంధగాడు సినిమాలలో హెబ్బా పటేల్ యాక్టింగ్ చూసి అయోధ్య కుమార్ ఆమెను తీసుకున్నారు.

ఇక్కడ ఇంకో షాకింగ్ వార్త ఏమిటంటే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజ సజ్జా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అతడికి జోడీగా హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి హెబ్బా మాట్లాడుతూ ఈ సినిమా లవ్ స్టోరీ అని.. అందులో తన క్యారెక్టర్ గతంలో తాను చేసిన సినిమాలన్నిటిలోకీ భిన్నంగా ఉంటుందని తెలిపింది. ఇంతకు మించి తన క్యారెక్టర్ గురించి రివీల్ చేయకూడదని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here