ఆనందంగా ఉండాలంటే చుట్టూ ఎంతమంది స్నేహితులు ఉండాలి..?

ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే అనుకుంటారు. అంతేకాకుండా ఆనందానికి గల కారణాలను కూడా ఓ కంట కనిపెడుతూ ఉంటారు. అందుకు తగ్గట్టే ప్లానింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది స్నేహితులతో ఉంటే తాము ఆనందంగా ఉన్నామని చెబుతూ ఉంటారు. ఆనందంగా ఉండాలంటే ఇంతకూ ఎంతమంది స్నేహితులు మన చుట్టూ ఉండాలి..?

సాధారణంగా సోషల్ మీడియాలో కొన్ని వేల మంది ఫ్రెండ్స్ ఉంటారు.. కానీ మనకు తెలిసిన స్నేహితులూ.. మన చుట్టూ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మన బ్రెయిన్ ప్రవర్తన బట్టి ఎప్పుడూ కలుసుకునే వాళ్ళు మొత్తం కలిపి 150 మని ఉంటారు. వారిలో తమ ఆఫీసులో పని చేసేవాళ్ళు, కాలేజ్, స్కూల్ ఫ్రెండ్స్.. ఇలా మొత్తం 150 మంది దాకా మనం స్నేహం చేస్తూ ఉంటామట. అయితే వీరందరిలోనూ కేవలం అయిదు మంది ఉంటే చాలు మనుషులు ఆనందంగా ఉంటారట.

మనకు మొత్తం 150 మంది స్నేహితులు ఉంటే వాళ్ళలో 50 మందితో క్లోజ్ గా ఉంటామట.. కానీ ఒక్కో వ్యక్తిగా వాళ్ళను చూసుకుంటే కేవలం 5 మందితో మాత్రమే మనం అన్ని విషయాలను చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి ఆ అయిదుగురే మన లోకం అవుతుందని. వారితో ఉన్నప్పుడే ఆనందంగా ఉంటామని ఇటీవల చేసిన సర్వేలో స్పష్టం అయింది.

Image result for Here are how many friends one needs to be happy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here