బన్నీ ఫేవరేట్ థియేటర్ అదే.. భార్యతో కలిసి ఆ థియేటర్ లోనే ‘నా పేరు సూర్య’ చూశాడు..!

కొందరికి కొన్ని ఇష్టమైన థియేటర్లు ఉంటాయి.. ఎందుకో చాలా దూరమైనా కూడా అక్కడికే వెళ్ళి చూస్తూ ఉంటారు. దాన్నే సెంటిమెంట్ అని కూడా అంటూ ఉంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా ఒక ఇష్టమైన థియేటర్ ఉంది. అదేమిటంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్.

శుక్రవారం సాయంత్రం భార్య స్నేహ, కుటుంబసభ్యులు, తన సినిమా యూనిట్ తో కలిసి అక్కడ బన్నీ సందడి చేశాడు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారందరినీ దాటుకొని థియేటర్లోకి వెళ్లిపోయారు. అనంతరం సినిమా చూసి కుటుంబంతో వెనుతిరిగారు. ”నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా తొలిరోజు 16.28 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ మొత్తం కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్ళు మాత్రమే. అయితే గతంలో రిలీజైన అల్లు అర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఏకంగా తొలిరోజున 17.9 కోట్లు షేర్ వసూలు చేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here