కారులో బెలూన్లు తెరచుకోవడం వలనే హీరో నానికి పెద్ద ప్రమాదం జరగలేదు.. ముఖానికి గాయాలా..!

హీరో నాని ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ప్రయాణిస్తున్న నాని కారు ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొంది. నానికి గాయాలయ్యాయని నాని కారు డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే నాని ప్రథమ చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లిపోయాడు.

అయితే నాని పెదవికి స్వల్ప గాయం అవడంతో వారం రోజుల విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడం వల్లే నానికి, డ్రైవర్ కు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో నాని కారు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించగా మద్యం సేవించలేదని తేలింది. నిద్రమత్తులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కారు డ్రైవర్ పోలీసులకు తెలిపారు.

ఆ ప్రమాద ఘటనపై అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని నాని ట్వీట్ చేశారు. ఆ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని, కంగారు పడాల్సిన పనిలేదని ట్వీట్ చేశారు. యుద్ధానికి కొంతకాలం విరామం ప్రకటించానని…`కృష్ణార్జున యుద్ధం` షూటింగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here