గాయాలయింది రవితేజకు అనుకున్నారు.. పాపం హీరోయిన్ కు..!

మాస్ మహారాజా రవితేజ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా రవితేజ గాయపడ్డాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలిసింది. దర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. ఇదంతా కేవలం పుకారు మాత్రమేననీ ..ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. షూటింగు సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదనీ .. ఎప్పటిలానే షూటింగులో రవితేజ చురుకుగా పాల్గొంటున్నాడని తెలిపాడు.

అయితే షూటింగ్ లో గాయపడింది హీరోయిన్ మాళ‌వికా శ‌ర్మ అని తెలిసింది. ఆమెకి కొంత విశ్రాంతి కావాల‌ని డాక్టర్లు సూచించడంతో సినిమా షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతుంది. మాళవిక శర్మ పలు యాడ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఆమె మొదటి సినిమా.. పాపం మొదటి సినిమాలోనే ఈ గాయాలు ఏంటి అని టాలీవుడ్ జనాలు ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాని సరసన కూడా మరో సినిమా చేయనుందని టాక్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here