యూనివర్సిటీ లేడీస్ టాయ్ లెట్ లో బయటపడ్డ సీక్రెట్ కెమెరా.. ఎప్పటి నుండీ పెట్టారోనని భయపడుతున్నారు..!

మహిళలకు ఎక్కడ కూడా ప్రశాంతత లేకుండా పోతోంది. కామాంధుల కళ్ళే కాకుండా.. సీక్రెట్ కెమెరాలు కూడా వారిని చాలా రోజుల నుండి వెంటాడుతూనే ఉన్నాయి. ఇది మన దేశంలో మాత్రమే ఉన్న సమస్య కాదు.. చాలా దేశాల్లో ఉన్న సమస్య..! మహిళల బాత్ రూమ్ లలో.. షాపింగ్ మాల్ డ్రెస్ చేంజింగ్ రూమ్ లలో.. ఎక్కడ పడితే అక్కడ సీక్రెట్ కెమెరాలను పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు సింగపూర్ లోని ‘నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ’ లోని అమ్మాయిలు కూడా బాధితులయ్యారు.

ఈ విషయం ఇటీవల ఓ యువతి బాత్ రూమ్ లో ఉండగా కనుక్కొంది. వెంటిలేటర్ పైన ఉన్న ఓ హుక్ లో ఓ నల్లటి వస్తువు ఉన్నట్లు గుర్తించింది. దానిని వెళ్ళి చూడగా అది కాస్తా సీక్రెట్ కెమెరా అని తెలుసుకుంది. వెంటనే ఆ విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి తెలియజేసింది. ఆ బాత్ రూమ్ వికలాంగుల కోసం కేటాయించినదట.. కానీ ఇతర బాత్ రూమ్ లు ఫుల్ అయినప్పుడు ఈ బాత్ రూమ్ నే చాలా మంది మహిళలు వాడుతూ ఉంటారు. చాలా మంది విద్యార్థినులు, మహిళా స్టాఫ్ కూడా ఈ బాత్ రూమ్ ను వాడినవారిలో ఉన్నారు.

ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అందులో ఓ మెమొరీ కార్డ్ కూడా ఉంది. వెంటనే దాన్ని పోలీసులు సీజ్ చేసి తమతో పాటూ తీసుకొని వెళ్ళారు. ఎప్పటి నుండి కెమెరాను అక్కడ అమర్చారోనని విద్యార్థినులు భయపడుతూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here