`కాలా`కు లైన్ క్లియ‌ర్..! ఇక సినీ పెద్ద‌లు ఏం చెబుతారో?

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన తాజా చిత్రం `కాలా`. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. క‌ర్ణాట‌క‌లో ఈ సినిమా విడుద‌ల అవుతుందా? లేదా? అనే అనుమానాల‌ను ఆ రాష్ట్ర హైకోర్టు ప‌టాపంచ‌లు చేసింది. క‌ర్ణాట‌క‌లో కాలా చిత్రం నిషేధంపై జోక్యం చేసుకోలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.

థియేటర్ల వివరాలు అందించాలని ‘కాలా’ తరపు న్యాయవాదులకు హైకోర్టు నిర్దేశించింది. కాలా సినిమా ప్రదర్శనకు తగిన భద్రత కల్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు జారీ చేసింది. కావేరి జ‌లాల విష‌యంలో ర‌జ‌నీకాంత్ త‌మిళనాడుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఆయ‌న సినిమాల‌ని క‌ర్ణాట‌క‌లో విడుద‌ల కానివ్వ‌మంటూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here