అతడిది వేరే మతం.. ప్రేమను తెంచుకోమన్న తండ్రి.. మాట వినకపోవడంతో..!

ముస్లిం యువతి హిందూ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఆమె తండ్రికి తెలిసింది. అతడి మతం వేరే.. నీ ప్రేమను తెంచుకో అని తండ్రి ఆ యువతికి చెప్పాడు. అయితే ఆమె ప్రియుడిని వదులుకోలేకపోయింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆ యువతి తండ్రి కుమార్తె ప్రేమించిన వ్యక్తిని గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని రఘువీర్ నగర్ లో చోటుచేసుకుంది.

20 ఏళ్ల ముస్లిం ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న అంకిత్ సక్సేనాతో గత మూడేళ్లుగా ప్రేమలో ఉంది. యువకుడి మతం వేరు కావడంతో వారి ప్రేమను యువతి తండ్రి వ్యతిరేకించాడు. అయినప్పటికీ వారి మధ్య ప్రేమ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి హెచ్చరించిన యువతి తండ్రి, అంకిత్ పై దాడి చేసి, అతని గొంతు కోసి చంపాడు. ఈ హత్యలో ఆ యువతి తండ్రి, అతడి భార్య, ఓ దగ్గరి బంధువును కూడా అరెస్ట్ చేశారు.

ఆ యువతి మాట్లాడుతూ.. తాము మరికొద్ది రోజుల్లో పెళ్ళి చేసుకోవాలని అనుకున్నామని ఈ రోజు కూడా తాను అతన్ని కలవాలని అనుకున్నానని చెప్పింది. అంతలోనే అంకిత్ ను ఎవరో కత్తితో పొడిచేసారన్న విషయం తెలిసిందని చెప్పుకొచ్చింది. కొన్నేళ్ళ క్రితం తాము ఇరుగుపొరుగు ఇంట్లో ఉండేవాళ్ళమని అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆమె చెప్పుకొచ్చింది. చివరికి తమ ప్రేమ ఇలా ప్రాణాల మీదకు తీసుకొని వచ్చిందని వాపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here