పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు.. కార‌ణం తెలిస్తే అత‌డినే త‌ప్పుప‌డ‌తారు!

సీటు బెల్టు పెట్టుకోకుండా కారును డ్రైవ్ చేస్తోన్నాడంటూ ఓ క్యాబ్‌ను ఆపారు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు. జ‌రిమానా విధించారు. త‌ప్పు చేసినందుకు జ‌రిమానా కూడా క‌ట్టాడు. క‌ట్టిన త‌రువాత అక్క‌డి నుంచి వెళ్లిపోవాలి. ఆ క్యాబ్ డ్రైవ‌ర్ మాత్రం అలా చేయ‌లేదు.

జ‌రిమానా క‌ట్టి మ‌రీ ట్రాఫిక్ కానిస్టేబుళ్ల‌తో వాగ్వివాదానికి దిగాడు. గొడ‌వ పెట్టుకున్నాడు. ఆ ఆవేశంలో క్యాబ్‌లో క్యాన్‌లో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని, నిప్పంటించేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న చెన్నైలో చోటు చేసుకుంది. ఆ క్యాబ్ డ్రైవ‌ర్ పేరు మ‌ణికంఠ‌న్‌.

తిరునల్వేలి జిల్లాకు చెందిన యువ‌కుడు. కొంత‌కాలంగా చెన్నైలో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం అతను సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారును న‌డిపిస్తుండ‌గా.. చెన్నై రాజీవ్‌గాంధీసాలై వ‌ద్ద‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. జరిమానా వేశారు. జ‌రిమానా క‌ట్టాడు కూడా.

అక్కడి నుంచి వెళ్లిపోకుండా ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వారి ఫొటోలు, వీడియో తీయ‌బోయాడు. ఎందుకు తీస్తున్నావంటూ ప్ర‌శ్నించాడు పోలీసులు.

దీంతో నడిరోడ్డుపై తనను పోలీసులు అవమానించారంటూ మణికంఠ‌న్‌ ఆవేశానికి గుర‌య్యాడు. క్యాన్‌లో ఉన్న పెట్రోల్‌ను ఒంటి మీద పోసుకున్నాడు.

అందరూ చూస్తుండగానే నిప్పంటించుకున్నాడు. ట్రాఫిక్ పోలీసులు మంటలు ఆర్పి అతణ్ణి స‌మీపంలో ఉన్న ఆసుప్రతికి తరలించారు. 50 శాతానికి పైగా శరీరంపై కాలిన గాయాలయ్యాయని డాక్ట‌ర్లు తెలిపారు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here