ఈ హ‌డావుడి చూసి..పెళ్లి కొడుకు ఎంత అదృష్ట‌వంతుడో అనుకునేరు!

బెంగ‌ళూరు: స‌్టీల్ బిందెలు, ప్లేట్లు, కుక్క‌ర్లు.. ఇవ‌న్నీ చూస్తోంటే పెళ్లి కొడుకు ఎంత అదృష్ట‌వంతుడో.. అత్తింటి వారు అన్ని సామాన్ల‌నూ పంపుతున్నార‌ని అనుకునేరు. ఈ సామాన్ల‌న్నీ పెళ్లి కొడుకున‌కు వ‌ర‌క‌ట్న రూపంలో ఇవ్వ‌బోతున్న‌ది కాదు.. ఓట‌ర్ల‌కు పంచ‌డానికి.

స్టీలు బిందెలు, ప్లేట్లు, కుక్క‌ర్లు జ‌నం చేతిలో పెట్టి ఓట్లు కొల్ల‌గొట్ట‌డానికి రాజ‌కీయ పార్టీలు చేస్తోన్న క‌స‌ర‌త్తు తాలూకు ఫొటోలు ఇవి. క‌ర్ణాట‌కలో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ స‌మ‌యంలో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డానికి అన్ని రాజ‌కీయ పార్టీలు అన్ని ర‌కాలుగా గాలం వేస్తున్నారు.

ఇలా స్టీలు ప్లేట్లు, బిందెలు, కుక్క‌ర్ల‌ను భారీగా తీసుకొచ్చారు. ఇవ‌న్నీ తీసుకొస్తున్న వాహ‌నాన్ని పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు ప‌ట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. బెంగ‌ళూరు విజ‌య‌న‌గ‌ర‌లోని రాఘ‌వ‌న‌గ‌ర‌లో ఈ వ‌స్తువులు పోలీసుల చేతికి చిక్కాయి.

ఇందులో స్టీల్ బిందెలు, గ్యాస్ స్ట‌వ్‌లు 2000 చొప్పున‌, 1500 వ‌ర‌కు కుక్క‌ర్లు, ప్లేట్లు.. చివ‌రికి కూర‌గాయ‌లు త‌రిగే క‌త్తులు కూడా ఉన్నాయి. ఆయా సామాన్లపై `3` అనే సంఖ్య‌ను ముద్రించారు. అంటే- ఈవీఎంలో మూడో అంకెకు ఓటు వేయ‌మ‌ని అర్థ‌మ‌ట‌. ఆ అంకె బీజేపీ అభ్య‌ర్థిదేనంటూ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here