హోమ్‌గార్డు, అత‌ని కుమారులు..రైలు ప‌ట్టాల‌పై చెల్లాచెదురుగా

ఖ‌మ్మం జిల్లాలో ఓ హోమ్‌గార్డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న ఇద్ద‌రు కుమారుల‌ను రైలు కిందికి తోసి, తానూ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. చ‌ర్చి కాంపౌండ్ స‌మీపంలో ఉన్న రైల్వేగేటు వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హోమ్‌గార్డు పేరు కాశీ విశ్వ‌నాథ్‌. జిల్లాలోని కల్లూరు మండలానికి చెందిన వ్య‌క్తి. పొరుగునే ఉన్న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో హోమ్‌గార్డుగా ప‌నిచేస్తున్నాడు.

కార‌ణ‌లేమిటో తెలియ‌రావట్లేదు గానీ.. త‌న ఇద్ద‌రు కుమారులు జ‌యంత్‌, అజ‌య్‌కుమార్‌ల‌తో క‌లిసి చ‌ర్చికాంపౌండ్ రైల్వేగేట్ వ‌ద్ద రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ఆరంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here