ఏడుస్తూ బ‌య‌టికొచ్చిన విద్యార్థులు! అప్ప‌టిక‌ప్పుడు స్కూల్‌కు సెల‌వు ఎందుకు ప్ర‌క‌టించారంటే..

అదో ప్రైవేటు స్కూల్‌. మ‌ధ్యాహ్నం భోజ‌నం ముగిసిన త‌రువాత కొద్దిసేప‌టికే స్కూలులో క‌ల‌క‌లం చెల‌రేగింది. పిల్ల‌లంద‌రూ ఒక్క‌సారిగా భ‌యంతో బ‌య‌టికి ప‌రుగులు తీశారు. ఏడుస్తూ బ‌య‌టికి వ‌చ్చేశారు. దీనికి కార‌ణం.. తేనెటీగ‌లు.

స్కూలు ఆవ‌ర‌ణ‌లో ఉన్న ఓ చెట్టుకు ప‌ట్టిన తేనెప‌ట్టు నుంచి రొద చేసుకుంటూ తేనెటీగ‌లు విద్యార్థులు, టీచ‌ర్లు, అక్క‌డి సిబ్బందిపై దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌వేరిలో చోటు చేసుకుంది. హ‌వేరి విద్యాన‌గ‌ర‌లోని కేఎల్ఈ స్కూలు అది.

మ‌ధ్యాహ్నం భోజంన అనంత‌రం తేనెటీగ‌ల దండు విద్యార్థుల‌పై దాడి చేసింది. తేనెటీగ‌ల దండు ఒక్క‌సారిగా త‌ర‌గ‌తి గ‌దుల్లోకి దూసుకు రావ‌డంతో పిల్ల‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. సుమారు 40 మంది పిల్ల‌లు తేనెటీగ‌ల బారిన ప‌డ్డారు.

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన టీచ‌ర్లు, సిబ్బంది వారిని బ‌య‌టికి తీసుకెళ్లారు. స్కూల్‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. విద్యార్థుల‌ను స్కూల్ వ్యాన్‌లో ఇళ్ల‌కు తీసుకెళ్లారు. తేనెటీగ‌ల దాడిలో గాయ‌ప‌డిన వారికి ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

చికిత్స అనంత‌రం ఇళ్ల‌కు చేర్చారు. ఈ స‌మాచారం అందుకున్న వెంటనే మున్సిప‌ల్ అధికారులు స్కూల్‌కు వ‌చ్చి.. ఫాగింగ్ చేశారు. దీనితో తేనెటీగ‌లు చెదిరిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here