భార్యను చంపడానికి మాస్టర్ ప్లాన్.. హనీమూన్ కు తీసుకొని వెళ్ళి.. బోటు తిరగబడేలా చేసి..!

భార్యను హనీమూన్ కు తీసుకొని వెళ్ళి బోటు తిరగబడి చనిపోయిందని నమ్మించాడు.. అయితే పోలీసులకు అనుమానం రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇదంతా అతడు వేసిన మాస్టర్ ప్లాన్ అని బయట తెలిసిపోయింది.

బ్రిటన్ కు చెందిన లెవీస్ బెన్నెట్ తన భార్య ఇసబెల్లా హెల్మన్ ను గత ఏడాది మే 15న హనీమూన్ కు కరీబియన్ దీవులకు తీసుకొని వెళ్ళాడు. వారు తాము నివసిస్తున్న ప్రాంతం ఫ్లోరిడాకు తిరిగివస్తుండగా.. తన భార్య కనిపించలేదని చెప్పుకొచ్చాడు. బోట్ ఆటో పైలట్ మోడ్ లో వెళుతోండగా తాను డెక్ పై నిద్రపోతున్నానని చెప్పాడు. ఇంతలో బోట్ కు ప్రమాదం జరగగా తాను లైఫ్ బోట్ సహాయంతో తప్పించుకొన్నానని ఎఫ్బీఐ కి వివరించాడు. తాను బోట్ మునిగిపోయే సమయానికి బయటకు వచ్చేశానని.. తన భార్య కోసం వెతికాను కానీ.. ఆమె కనిపించలేదని చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత లెవీస్ ను చూసిన యు.ఎస్. కోస్టల్ సిబ్బంది అతన్ని రక్షించారు.

ఆమె కోసం దాదాపు నాలుగురోజుల పాటూ గాలించారు. అయితే ఏ మాత్రం ఆచూకీ దొరకలేదు. ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే ఇసబెల్లా పేరు మీద ఉన్న ఓ ప్రాపర్టీని తన పేరు మీద బదలాయించుకోవాలని అనుకున్నాడు. దీంతో పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. బోట్ లో నుండి అతడు బయటపడ్డప్పుడు కొన్ని వస్తువులను బయటకు తీసుకొని వచ్చాడు కానీ.. భార్యను మాత్రం కాపాడలేకపోయానని చెప్పడం అనుమానాలాకు తావిచ్చింది. అంతేకాకుండా బోట్ ను స్వాధీనం చేసుకొన్న పోలీసులు దాన్ని పరిశీలించగా బోటు లోపల పగులగొట్టడం వలనే మునిగిపోయిందని భావించారు. దీంతో లెవీస్ ను కోర్టులో హాజరుపరిచారు. అతడే భార్యను హత్య చేశాడని భావించిన న్యాయమూర్తి లెవీస్ కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించాడు. తీర్పు చెప్పినప్పుడు ఇసబెల్లా తల్లి అక్కడే ఉంది.. తన కూతురుకు ఏమి జరిగిందో ఇద్దరే ఇద్దరికి తెలుసని.. ఒకరు ఆ దేవుడు అయితే.. ఇంకొకరు లెవీస్ అని ఆమె చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here