ఆ గ్రామం మీద నాగిణి శాపం పెట్టిందట.. ఎవరైనా ఇంటికి తలుపులు పెడితే..!

యూపీ రాష్ట్రం లోని ఓ గ్రామస్థులు ఇప్పుడు కూడా గతంలో జరిగిన ఓ ఘటన గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ గ్రామంలో ఏ ఇంటికి కూడా తలుపులు అనేవే ఉండవు. ఎవరైనా ఇంటికి తలుపులు పెడితే ఖచ్చితంగా వారికి ఏదో ఒకటి హాని జరుగుతుంది. అలాగని వారికి దొంగతనాల గురించి ఎటువంటి భయం లేదు.. అలాగే రక్షణ గురించి కూడా ఎటువంటి చింతా లేదు. ఇప్పటివరకూ ఆ ఊరిలో దొంగతనం అనేదే జరగలేదట. ఇంతకూ ఇలా ఇళ్ళకు తలుపులు లేకుండా ఉండడానికి కారణం ఏమిటంటే గతంలో ఓ నాగదేవత పెట్టిన శాపమట..!

Myth: इस गांव पर है एक नागिन का श्राप, अगर घर में दरवाजा लगाया तो...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ప్రతాప్ ఘడ్ జిల్లాలోని సూడేమవూ గ్రామానికి సంబంధించిన విషయం ఇది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ఇళ్ళకు తలుపులు ఉండవు. అలాగే 100 ఏళ్లకు పైగా ఈ గ్రామానికి నాగిణి శాపం ఉందట.. అందుకే ఏ ఇళ్ళకు కూడా తలుపులు ఉండవు. కొన్నేళ్ళ క్రితం ఆ ఊరిలో తలుపు కింద పడి ఓ నాగుపాము చనిపోయిందట.. దీంతో ఆ నాగుపాము ఒక్కసారిగా నాగిణి రూపంలో ప్రత్యక్ష్యం అయి..’ఇకపై ఈ ఊరిలో ఎవరు కూడా ఇంటికి తలుపులు పెట్టకూడదు.. ఒకవేళ అలా చేస్తే సర్వ నాశనం అవుతారు’ అని చెప్పింది. దీంతో భయపడిపోయిన గ్రామస్థులు అప్పటి నుండి ఇళ్ళకు తలుపులు అన్నవే లేకుండా చూసుకున్నారు. మాట వినకుండా అలా తలుపులు ఉంచిన వాళ్ళ ఇంట్లో కీడు జరిగిందట.. అందుకే ఎవరూ కూడా సాహసించరు.

Myth: इस गांव पर है एक नागिन का श्राप, अगर घर में दरवाजा लगाया तो...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here