కారును ఏడ‌బ‌డితే గాడ పార్క్ చేస్తే..గిట్ల‌నే ఐతది!

బీజింగ్‌: కారుంది క‌దాని ఎక్క‌డ ప‌డితే పార్క్ చేస్తే కుద‌ర‌దు అక్క‌డ‌. మ‌న‌లాగ టో క‌ట్టుకుని వెళ్లిపోరు పోలీసులు. వెరైటీగా.. ద‌గ్గ‌ర్లో ఉన్న మిద్దెపైకి ఎక్కించేస్తారు. ఇక దాన్ని కిందికి దించుకోవాలంటే.. ఆ కారు య‌జ‌మాని త‌ల ప్రాణం తోక కొస్తుంది.

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోలు ప్ల‌స్ వీడియో చైనాలోని హ్యుబేయ్ ప్రావిన్స్‌లోని గ్ఝిషుయ్ కంట్రీలోనిది. ఓ డ్రైవ‌ర్ త‌న కారును బ‌స్‌స్టాండ్‌లో అక్ర‌మంగా పార్క్ చేశాడు. ఒక‌ట్రెండు సార్లు అత‌డికి చెప్పి చూశారు బ‌స్‌స్టాండ్ సిబ్బంది. వినిపించుకోలేదు.

ఈ సారి పార్క్ చేయ‌గానే.. వారు నేరుగా స్థానిక ట్రాఫిక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారు రావ‌డం రావ‌డంతోనే ఏకంగా క్రేన్ వేసుకుని మ‌రీ వ‌చ్చారు.

కారును క్రేన్‌తో ఎత్తి..అదే బ‌స్‌స్టాండ్ రూఫ్‌పై పెట్టేశారు. ఇక ఆ కారును కిందికి దించుకోవాలంటే.. ఆ డ్రైవ‌ర్ మ‌ళ్లీ క్రేన్‌ను తెచ్చుకోవాల్సిందే. క్రేన్ తెచ్చుకుని కిందికి దించుకోవాలంటే ట్రాఫిక్ పోలీసుల అనుమ‌తీ కావాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here