ఎందుకో రేఖ గారు అలా ప్రవర్తించారు..!

సినీ నటి రేఖ.. దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్.. ఒకప్పుడు తెలుగు సినిమాలో అవకాశం ఇవ్వకపోవడంతో రేఖ బాలీవుడ్ కు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూడలేదు. ప్రస్తుతం చాలా సంవత్సరాల తర్వాత ధర్మేంద్రతో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కెమెరా నుండి మొఖం దాచుకోడానికి ఆమె విచిత్రంగా ప్రవర్తించింది.

కళానికేతన్ క్లాసిక్ షోరూంలో షాపింగ్ కు వెళ్లిన రేఖ బయటకు వస్తున్న సమయంలో చూసిన అభిమాని ఆమెను చిత్రీకరించాడు. దానిని గుర్తించిన ఆమె ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ఇంతలో ఆమె డ్రైవర్ వచ్చి అభిమానిని ప్రశ్నించి కారు డోర్ తెరిచారు. దీంతో వేగంగా కారులో కూర్చుని డోర్ మూసేశారు. ఆమె ముఖం దాచుకోడానికి కారణం ఏమిటీ అన్నది నెటిజన్లకు ఇంకా అర్థం కాలేదు. తెల్లటి చుడీదార్ తో లోపలి నుండి బయటకు వచ్చిన రేఖ.. ఎండ తీవ్రతకు మొఖం దాచుకోవాలని ప్రయత్నించారు. కానీ అంతలోనే తనను ఎవరో వీడియోలో బందిస్తున్నారని తెలియగానే ముఖాన్ని ఏదో వింతగా దాచేసుకున్నారు. మార్చి మొదటి వారంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here