మొబైల్ ఫోన్ యూజ‌ర్లు ఇంత‌కాలం ఎదురు చూసింది..వ‌చ్చేసింది! ఇక ఆధార్ లింక్ సులువు!

మొబైల్ నంబ‌ర్‌కు, ఆధార్ నంబ‌ర్‌కు లింక్ చేసుకోవ‌డానికి గ‌డువు ద‌గ్గ‌ర ప‌డింది. గ‌డువు పూర్త‌య్యేలోగా.. ఆధార్‌ అనుసంధానానికి రిటైల్‌ స్టోర్లకు వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా ఏదైనా ఓ సులువైన ప‌ద్ధ‌తి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఇన్నాళ్లూ మొబైల్ యూజ‌ర్లు ఎదురు చూసే ఉంటారు.

వారి ఎదురు చూపులు ఫ‌లించాయి. రిటైల్ స్టోర్స్ వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా.. ఐవీఆర్ఎస్ ద్వారా ఆధార్ నంబ‌ర్‌ను లింక్ చేసుకునే వెస‌లుబాటు అందుబాటులోకి వ‌చ్చేసింది.

దీని కోసం ఆధార్‌కార్డు జేబులో ఉంటే చాలు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్‌ ఇలా ఏ నెట్‌వర్క్‌ కస్టమర్‌ అయినా సరే.. మొద‌ట‌ 14546 నంబర్‌ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

డయల్‌ చేయగానే ఇండియన్‌.. లేక ఎన్నారై అనే ప్ర‌శ్న వినిపిస్తుంది. ఇందులో ఒక‌దానిపై మ‌నం నంబ‌ర్ బ‌ట‌న్ ప్రెస్ చేయాలి. తర్వాత 1 అనే నంబ‌ర్‌ను ప్రెస్ చేయాలి.

వెంట‌నే.. ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాల‌ని చెబుతారు. నంబర్‌ను పొందుపరిచిన తర్వాత అది.. క‌రెక్ట్ అయితే 1ని నొక్కాలంటూ చెబుతారు. ఆ వెంట‌నే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీ నంబ‌ర్‌తో పాటు.. మొబైల్‌ నంబర్‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంది. మొబైల్‌ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను ధృవీక‌రించాలి. అలా వ‌చ్చిన త‌రువాత 1ని ప్రెస్ చేయ‌డం ద్వారా ఆధార్‌ నంబర్‌ రీ వెరిఫికేషన్‌ను పూర్తి అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here