ఆరేళ్ల కింద‌ట మ‌ర‌ణించిన ఆమె.. ఇన్నేళ్ల త‌రువాత ఓ దేశ చ‌ట్టాన్నే మార్చివేసింది!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న మ‌హిళ పేరు స‌విత హాల‌ప్ప‌న‌వ‌ర్‌. క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ డెంటిస్ట్‌. త‌న భ‌ర్త‌తో క‌లిసి ఐర్లాండ్‌లో నివాసం ఉండేవారు. 2012లో ఆమె గ‌ర్భం దాల్చారు. మూడు నెల‌ల‌ గర్భిణిగా ఉన్నపుడు తీవ్ర‌మైన‌ కడుపునొప్పి ఆమెను చుట్టుముట్టింది. పిండం అడ్డం తిర‌గ‌డం వ‌ల్లే క‌డుపునొప్పి వ‌చ్చింద‌ని, అబార్ష‌న్ చెయ్య‌క‌పోతే బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని తేల్చేశారు డాక్ట‌ర్లు.

ఐర్లాండ్ చ‌ట్టం ప్ర‌కారం అబార్ష‌న్ చెయ్య‌డం అక్క‌డ నిషేధం. తీవ్ర‌మైన నేరం. చ‌ట్టం ప్ర‌కారం.. సవితకు అబార్షన్‌ చేయలేదు డాక్ట‌ర్లు. ఏ ఒక్క‌రు కూడా ముందుకు రాలేదు. దీనితో ఆమె తీవ్ర‌మైన క‌డుపునొప్పితో మ‌ర‌ణించారు. ఆమె చావు ఆ దేశాన్ని క‌దిలించింది. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసింది.

అబార్ష‌న్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలంటూ పెద్ద ఉద్యమాన్ని నిర్వ‌హించేలా ఐరిష్ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. దీనితో అబార్ష‌న్‌పై ఇప్ప‌టిదాకా ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయాలా? వ‌ద్దా? అనే అంశంపై ఐర్లాండ్ ప్ర‌భుత్వం ఓ రెఫ‌రెండాన్ని నిర్వ‌హించింది.

అబార్ష‌న్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేయ‌డానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు అక్క‌డి ప్ర‌జ‌లు. ఈ రిఫరెండంలో ఆ కఠిన చట్టాల్ని రద్దు చేయాలని సుమారు 66.4 శాతం మంది ఓటేసినట్లు మీడియా తెలిపింది. 33.6 శాతం మంది వ్యతిరేకించారు. గర్భస్థ శిశువు, తల్లికి సమాన హక్కులు కల్పిస్తున్న 8వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభిప్రాయం సేకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here