రెండేళ్ల నాటి వీడియోతో హ‌ల్‌చ‌ల్‌!

హైద‌రాబాద్‌: సోష‌ల్ మీడియాలో ఎప్పుడేది వైర‌ల్‌గా మారుతుందో చెప్ప‌లేం. ఏ మాత్రం అంచ‌నా వేయ‌లేం. కొన్నేళ్ల కింద‌టి సంఘ‌ట‌న‌లు కూడా ఫ్రెష్‌గా వైర‌ల్‌గా మారిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడీ ఘ‌ట‌న కూడా అలాంటిదే. 2016 ఢిల్లీలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి తాజాగా వైర‌ల్‌గా మారింది.

ఢిల్లీలో ఓ ఆటో ట్రాలీని ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ పెట్రోల్ ట్యాంక్ పేలిపోయి, మంట‌లు అంటుకున్నాయి. ఈ ఘ‌ట‌నలో బైక‌ర్ అక్క‌డిక‌క్క‌డే స‌జీవంగా ద‌హ‌న‌మ‌య్యాడు. ట్యాంక్ నిండా పెట్రోలు పోయించుకోవ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం సంభ‌వించిందంటూ తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఎవ‌రికి వారు ఈ ఘ‌ట‌న త‌మ న‌గ‌రంలో చోటు చేసుకుందంటూ నెటిజ‌న్లు ఈ వీడియోను ఫ్రెష్‌గా షేర్ చేస్తున్నారు. బెంగ‌ళూరులోని బేగూర్‌లో చోటు చేసుకున్నట్టు ఒక‌రు, హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట్‌లో సంభ‌వించిన‌ట్టు ఇంకొక‌రు.. ఇలా ఎవ‌రికి వారే ఈ వీడియోను షేర్లు చేస్తున్నారు.

దీనితో ఇది వైర‌ల్‌గా మారింది. వేస‌విలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఎవ‌రూ పోయించుకోవ‌ద్దంటూ సూచిస్తున్నారు. ఈ సూచ‌న పాటించ‌ద‌గ్గ‌దే అయిన‌ప్ప‌టికీ..దాన్ని ఉద‌హ‌రించ‌డానికి ఓ ఓల్డ్ వీడియోను తాజాగా పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా ఫేక్ న్యూస్‌గా మారిపోయింది.

https://twitter.com/TArockFreak/status/983323056121700354

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here